NLG: జాతీయ రహదారిపై ట్రక్కు డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న గుర్మీత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్యాలలోని ‘డూన్ పంజాబీ దాబా’లో నిల్వ ఉంచిన ‘ఓపియం పాపీ హస్క్’ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు. పంజాబ్ నుంచి తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్ తెలిపారు