ADB: నిరుద్యోగులను మోసం చేసే వారిపై, నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలతో వ్యవహరిస్తుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులు మధు కిరణ్, సుధాకర్, సతీష్‌ను అరెస్టు చేసినట్లు ఇవాళ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్పీ అభినందించారు.