W.G: పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు ఆయుర్వేద ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. రూ. 12.50 కోట్లతో ఆసుపత్రిని 100 బెడ్లుగా అభివృద్ధి చేశామని, రూ. కోటితో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. బ్యూటిఫికేషన్ కోసం మరో రూ. 1.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.