పెద్దపల్లి: ధర్మారం మండలం నల్ల లింగయ్య పల్లి శ్రీ మల్లికార్జున మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాన శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సాన శంకరయ్య, సలహాదారుగా సాన మల్లయ్య ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కమిటీకి సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.