E.G: రాజమండ్రి మార్కెట్లో బోగి పిడకలు అమ్మకాలు జోరు అందుకున్నాయి. సంక్రాంతి పండగ ముందుగా వచ్చే భోగి పండుగకు గతంలో ఇళ్ల వద్ద ఆవు పేడతో పిడకలు చేసుకునేవారు. ప్రస్తుతం మారుతున్న కాలంలో పిడకలు చేయడం మానేశారు. దీంతో ప్రజలు భోగి పిడకలు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో భోగి పిడకలు రూ.30, రూ.50 దండలగా విక్రయిస్తున్నారు.