W.G: స్వచ్ఛ పంచాయతీ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని సర్పంచ్ తాడేపల్లి బేబీ అన్నారు. స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం వంతమైన జీవనం సాధ్యమన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.