MBNR: మిడ్జిల్ మండలంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహించిన యూపీ రాజుకు ఇటీవల ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి కల్పించింది. ఈ నేపథ్యంలో మండల ప్రజలకు అవసరమైన కుల, ఆదాయం తదితర సర్టిఫికెట్ల జారీకి ఎలాంటి జాప్యం కలగకుండా దేవరకద్రలో డీటీగా విధులు నిర్వహిస్తున్న స్వప్నను నూతన మిడ్జిల్ తహశీల్దార్గా ప్రభుత్వం నియమించింది. శనివారం ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.