WNP: కామారెడ్డిలో నిన్న జరిగిన రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో వనపర్తి ZPHSలో 8వ తరగతి చదువుతున్న ఉమర్ సిద్ధిక్ రాష్ట్రస్థాయిలో ద్వితీయబహుమతి సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థి ఉమర్ సిద్ధిక్, గైడ్ టీచర్ నరేష్ కుమార్లను పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించి అభినందించారు. విజ్ఞానశాస్త్రం పట్ల స్టూడెంట్స్కు ఆసక్తి, అవగాహనను పెంచుతాయని HM శివాజీ అన్నారు.