ATP: భారత డైరీ అసోసియేషన్ సౌత్ జోన్ నుంచి ‘అవుట్‌స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు’ అందుకున్న నారా భువనేశ్వరికి MLA పరిటాల సునీత శుభాకాంక్షలు తెలిపారు. డైరీ రంగంలో ఆమె చేసిన సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భువనేశ్వరి కృషికి తగిన గుర్తింపు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.