GDWL: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడన్న కారణంతో అన్నను తమ్ముడే పక్కా పథకం ప్రకారం హత్య చేసిన ఘటన గట్టు మండలంలో చోటుచేసుకున్నట్లు గద్వాల డీఎస్పీ వై. మొగులయ్య వెల్లడించారు. శనివారం గద్వాల సర్కిల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను తెలిపారు. మొదట మిస్సింగ్‌గా కేసుగా నమోదైందని, దర్యాప్తులో హత్యగా తేలినట్లు డీఎస్పీ వివరించారు.