NLG: చిట్యాల పురపాలిక పరిధిలోని శివనేనిగూడెం శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కమిషనర్ శ్రీనుకు ఇవాళ వినతిని అందించారు. మునిసిపల్ కౌన్సిల్లో తీర్మానం ఉందని చేసిన వ్యాఖ్యలపై వారు స్పందిస్తూ.. తీర్మానం కాపీని బయటపెట్టాలని నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు.