కృష్ణా: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు, సబ్ కాంట్రాక్టర్లు వేతనాలు చెల్లించకపోవడంపై ఆందోళనకు దిగారు. ఢిల్లీకి చెందిన ఎన్కేజీ సంస్థ గత కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించడంలేదని వాపోయారు. ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే రామాచారి హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు.