JGL: జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ అర్బన్ కాలనీలో మౌలిక సదుపాయాల కొరతపై కాలనీ వాసులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, నిలిచిపోయిన మురుగునీరు, పారిశుద్ధ్య లోపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. సమస్యల పర్యవేక్షణకు ప్రత్యేక మున్సిపల్ నోడల్ అధికారిని నియమించాలన్నారు.
Tags :