W.G. తణుకు పట్టణంలోని పైడిపర్రులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ గురువారం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయిన డొక్కా సీతమ్మ సేవలకు స్ఫూర్తి పొంది, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టడం విశేషం అన్నారు.