KMR: రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్, పాలక వర్గం సభ్యులు బుధవారం నీటిపారుదల శాఖ అధికారి వెంకటేశ్వర్లను కలిసి, డివిజన్-4లోని మత్తడివాగు కట్ట మరమ్మతులను ఆన్లైన్లో చేర్చాలని వినతి పత్రం అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా దెబ్బతిన్న కట్ట, ఇటీవలి వర్షాలతో మరింత దిగజారిందని, దీని మరమ్మతులు చేయకపోతే గ్రామ ప్రజలకు తీవ్ర అసౌకర్యం అని తెలిపారు.