KDP: సిద్ధవటం మండలం భాకరాపేటలోని క్రీడా మైదానంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గురువారం క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాజంపేట TDP సమన్వయకర్త పోలి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు స్నేహభావంతో ఆడాలన్నారు.