ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ స్కూల్‌ను ఎంపీడీవో షేక్ అబ్దుల్ ఖాదర్ గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజనం అమలుతీరును పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సిబ్బందికి సూచనలు చేశారు. రిజిస్టర్లను తనిఖీ చేసి పాఠశాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.