MLG: రోడ్డు భద్రత మాసొత్సవాలలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు భారాగాడి శ్రీనివాస్, యారబోలు వినోద్ రెడ్డి తనిఖీ చేసారు. పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, విద్యార్థులు, టీచర్స్ పాల్గొన్నారు.