అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో పోలీసులు టీ కేఫ్‌లు, పాన్ షాపుల్లో సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాలను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్ సాయంతో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.