TG: ప్రైవేట్ ఫార్మసీ కాలేజీల్లో చదివే ఫస్టియర్ విద్యార్థులకు ఊరట లభించింది. గతేడాది నవంబర్లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం ప్రైవేట్ కాలేజీలు బంద్ చేపట్టగా.. JNTU పరీక్షలను వాయిదా వేయలేదు. దీంతో వేల మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వారికి ఈనెల 27, 29న ఫస్టియర్ 2వ సెమిస్టర్ రెగ్యులర్, ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని JNTU ప్రకటించింది.