NRPT: మరికల్ మండలంలోని తీలేరులో సోమవారం అర్ధరాత్రి శివరాములు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను కోయిల్ సాగర్ కెనాల్లో తోసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం గ్రామస్థులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపాడు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా శివరాములు ఆసుపత్రికి తరలించారు. కాగా, పిల్లలు రిత్విక (8) చైతన్య (5) మృతి చెందినట్లు మరికల్ ఎస్సై రాము తెలిపారు.