KMR: జిల్లాలోని భిక్కనూర్ శివారులో నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రైవేటు సంస్థకు సంబంధించి ఈ నెల 7వ తేదీన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని అదనపు కలెక్టర్ విక్టర్ చెప్పారు. కంపెనీ ఏర్పాటు చేసే స్థలంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని ప్రజలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.