KRNL: మంత్రాలయం (మం) బుదూరు గ్రామ ఆశావర్కర్ నాగమ్మ అనారోగ్యంతో గత రాత్రి మృతి చెందింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా, ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందినట్లు తెలిపారు. తల్లి-శిశు సంరక్షణ, ప్రజారోగ్య కార్యక్రమాల్లో ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ తోటి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.