VSP: జిల్లాలోని అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రిలో బిమ్స్టెక్ దేశాల ప్రతినిధులకు క్యాన్సర్ కేర్‌పై ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. నరేంద్ర మోదీ పిలుపు మేరకు విదేశాంగ శాఖ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 7 దేశాల నుంచి 35 మంది నిపుణులు పాల్గొంటున్నారు. క్యాన్సర్ నివారణ, ఆధునిక చికిత్సల్లో ఉమ్మడి నెట్వర్క్ ఏర్పాటుపై చర్చించారు.