BHNG: భువనగిరి మండలం అనాజిపురం CPI(M) గ్రామశాఖ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న వితంతులకు, వృద్ధులకు పెన్షన్ లను మంజూరు చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్డీవోకి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునప్పటికీ పెన్షన్ రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.