ATP: పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని గార్లదిన్నె ఎస్సై మహమ్మద్ గౌస్ బాషా ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. మండలంలోని కమలాపురం గ్రామాల మీదగా పరిమితికి మించి కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోలను ఇవాళ ఆయన పట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక్కొక్క ఆటో 15 కూలీలను ఎక్కించుకుని వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.