KRNL: శృంగేరి నుంచి మంత్రాలయం వరకు చేపట్టిన నిర్మల తుంగభద్ర అభియాన్ పాదయాత్రను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ జెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. మంత్రాలయంలో హెచ్ఆర్బి కళ్యాణమంటపం వద్ద బసవరాజు పాటిల్ మీరాపూర్ నేతృత్వంలో జల జాగృతి జన జాగృతి నినాదాలతో యాత్ర కొనసాగింది. నది పవిత్రత పరిరక్షణ లక్ష్యంగా మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.