BHPL: మంచిర్యాల డిపో నుంచి కాలేశ్వరం, కాటారం మీదుగా మేడారానికి ప్రత్యేక బస్సు సర్వీసు ప్రారంభమైందని డిపో మేనేజర్ టి.శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మంచిర్యాల నుంచి బయలుదేరి చెన్నూర్, కాలేశ్వరం మీదుగా మధ్యాహ్నం 11:30కు మేడారం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 1 గంటకు మొదలై సాయంత్రం 6:30కు మంచిర్యాల చేరుకుంటుంది.