TPT: తిరుపతి రూరల్ పెరుమాళ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సుగన్ ఛంద్ అనే వ్యక్తి నిర్మిస్తున్న భవనం మూడో అంతస్తులో సెంట్రింగ్ పనులు చేస్తూ, గిరిపురం కాలనీకి చెందిన కార్మికుడు చంద్రమౌళి (45) కాలు జారి కింద పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయన్ను రుయా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.