MBNR: మిడ్జిల్ మండలంలోని దోనూర్లో ఆదివారం అయ్యప్ప స్వామి పల్లకీ సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి శోభాయాత్ర మేళతాళాల నడుమ గ్రామ వీధుల్లో భక్తిశ్రద్ధలతో సాగింది. అనంతరం మధ్యాహ్నం పడిపూజ, ఇరుముడి కార్యక్రమాలను పూర్తి చేసుకున్న స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరారు. 41 రోజుల పాటు దీక్షలో ఉన్న స్వాముల పూజలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.