WG: విశాఖపట్నంలో జరుగుతున్న 18వ అఖిల భారత సీఐటీయూ మహాసభలకు ఆచంట మండలం నుంచి భారీగా ప్రజా సంఘాల నేతలు, మహిళా కార్మికులు తరలివెళ్లారు. ఆదివారం వీరందరూ ప్రత్యేక బస్సులో విశాఖకు పయనమవ్వగా, సీపీఎం మండల కార్యదర్శి మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల రక్షణే ధ్యేయంగా ఈ మహాసభలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.