GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బోసురోడ్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ జేఆర్ అప్పల నాయుడు, కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు. డ్రైనేజ్, రోడ్డు విస్తరణ పనులను పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు.