NLG: హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు చిట్యాల మండలం నుంచి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు శనివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని కూలీలకు పని దినాలు తగ్గే ప్రమాదం ఉందని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా కార్యదర్శి చేకూరి మల్లేష్ ఆందోళన వ్యక్తం చేశారు. పథకం పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.