PPM: మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆహారపు అలవాట్లు, రసాయన ఎరువుల వల్ల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, సాగులో విపరీతంగా వాడుతున్న రసాయన ఎరువుల కారణంగా క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వస్తున్నాయన్నారు.