TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ ఇవాళ ముంబై వెళ్లనున్నారు. ఈ క్రమంలో సుప్రీం అడ్వొకేట్, ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ కానున్నారు. రేపు సుప్రీంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేసు విచారణ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఉన్న స్టేలు, పర్యావరణ ఉల్లంఘనలపై NGT విధించిన జరిమానాల వంటి అంశాలను చర్చించనున్నారు.