W.G: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అంకెం సీతారామ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న సీతారాంను జిల్లా పగ్గాలు వరించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.