AP: CM చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించనున్న ఆయన.. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. CM పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ప్రాజెక్ట్ సందర్శన ముగిశాక.. మ.3 గంటలకు చంద్రబాబు రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.