W.G: భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత అన్నదాన పథకానికి పట్టణానికి చెందిన తట్టవర్తి పట్టాభి రామయ్య, సత్యవతి దంపతులు రూ.1,11,116 విరాళంగా సమర్పించారు. మంగళవారం ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ దాతలకు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలు అందజేసి సత్కరించారు. అంతకుముందు అర్చకులు దాతలకు వేదాశీర్వచనం అందజేశారు.