అనంతపురంలోని నరిగమ్మ దేవాలయ పరిరక్షణ కోసం బసవతారక నగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. జనవరి 6న సాయంత్రం 4 గంటలకు జరిగిన సభకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయ పవిత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసి హిందూ ఐక్యతను చాటిన ప్రతిఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.