KNR: ఆర్టీసీ జోనల్ ఆసుపత్రిలో పొరుగు సేవల కింద నియామకం కానున్న కండక్టర్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ AV గిరిసింహారావు ఆధ్వర్యంలో అభ్యర్థుల ఆరోగ్య స్థితిగతులను పరీక్షించారు. అభ్యర్థులు విధుల్లో చేరాక క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఎటువంటి దురలవాట్లకు లోనుకాకుండా సంస్థ పురోగతికి తోడ్పడాలని హితవు పలికారు.