VZM: బొబ్బిలి MPDO కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ పనులపై డ్వామా PD శారదాదేవి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ పథకం నూతన చట్టంపై వేతనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ఏడాది పనులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పనులు చేపట్టాలని కొలతల ప్రకారం పనులు జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో MPDO రవికుమార్ పాల్గొన్నారు.