ATP: గుంతకల్లు మండలం ములకలపెంట గ్రామంలో పెద్దమ్మ అమ్మవారి ఊరిదేవర జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద సంఖ్యలో రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.