PPM: APTF జిల్లా కార్యవర్గ సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు స్థానిక పెన్షన్ దారుల భవనంలో జరుగుతుందని APTF జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల బాలకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు మర్రాపు మహేష్ అధ్యక్షతన నూతన కార్యవర్గ ఎన్నిక జరుగుతుందని, ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గుంపస్వామి ,ఉపాధ్యక్షుడు రామారావు హాజరవుతారని ఆయన తెలియజేశారు.