లాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించేందుకు LIC కొత్త కార్యక్రమం చేపట్టింది. ఏదైనా పాలసీపై ప్రీమియం చెల్లించడం ఆపేసిన ఐదేళ్లలోపు ఆ బాకీ ప్రీమియం చెల్లించి దాన్ని పునరుద్ధరించుకోవచ్చు. మార్చి 2 వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు LIC తెలిపింది. బాకీ ప్రీమియంపై 30% రాయితీ కూడా ఇస్తున్నట్లు చెప్పింది. అయితే, ఇది రూ.3 వేల నుంచి రూ.5 వేలు మించకుండా ఉంటుందని పేర్కొంది.