TG: అవినీతిపై కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేట కలెక్టరేట్లో అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వాలన్నారు. అమరవీరుల స్మారక నిర్మాణంలోనూ అవినీతి జరిగిందని కవిత చెప్పారని, ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలను ఏమనాలని ప్రశ్నించారు. చేసిన తప్పులు బయటపడతాయి అనే.. బీఆర్ఎస్ అసెంబ్లీకి రావడం లేదన్నారు.