బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై అకృత్యాలు కొనసాగుతున్నాయి. గత నెల రోజుల్లో రాడికల్స్ చేతిలో 12 మంది హిందువులు బలయ్యారు. మృతుల జాబితాలో ప్రాంతోస్ కర్మాకర్, ఉత్పల్ సర్కార్, జోగేష్ రాయ్, సుబోర్నో రాయ్, శాంతో దాస్, దీపు చంద్ర దాస్, పింటు ఆకండ, అమృత్ మోండల్, బజేంద్ర బిస్వాస్, ఖోకాన్ చంద్ర దాస్, రాణా ప్రతాప్, చక్రవర్తి ఉన్నారు. ఈ వరుస హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.