NLR: మనుబోలు- గూడూరు రైల్వే స్టేషన్ మధ్య చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో మూడో రైల్వే లైన్‌పై మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వయస్సు 45-50 ఉంటుందని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. మృతుడు పచ్చ రంగు ఫుల్ హాండ్స్ షర్టు, బులుగు రంగు గళ్ల లుంగి ధరించి ఉన్నాడని పేర్కొన్నారు.