VZM: రాజాం మునిసిపల్ కమీషనర్ రామచంద్రరావు ఇవాళ స్దానిక తెలగ వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్దానికులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు స్మశాన వాటికలో షెడ్డు నిర్మించాలని కోరారగా.. సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.