BDK: కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా పాల్వంచలోని షెడ్యూల్డ్ ప్రాంతాలను మున్సిపాలిటీలో చేర్చారని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. సమీప మండలాలను వదిలి 30 కిలోమీటర్ల దూరంలోని సుజాతనగర్ను కలపడం లోపభూయిష్టమని పేర్కొంటూ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.