పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్లో బోటింగ్ నిలిచిపోవడంతో సందర్శకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చెరువు గుర్రపుడెక్క, తామరాకులతో నిండిపోవడంతో బోట్లు తుప్పుపడుతున్నాయి. నిత్యం వేలాదిగా వచ్చే పర్యాటకులు బోటింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.